YS Jagan : ఏపీ సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా.. ‘@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు…