Youtuber : తెలివి తెల్లారినట్టే ఉంది.. వ్యూస్, లైక్స్ కోసం విమానాన్నే కూల్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber : ఈ మధ్య జనాలకు పిచ్చి పట్టుకుంది. రీల్స్ చేసుకుంటూ వ్యూస్ లైక్స్ కోసం పాకులాడుతున్నారు. వాటి కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎలాంటి సాహసాలైన చేస్తున్నారు. వాటి వల్ల ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ట్రెవర్ డేనియల్ జాకబ్ వాలెట్ అనే ఓ యూ ట్యూబర్ కూడా ఇలాంటి పనే చేశాడు. తన వీడియోకు లైకులు, వ్యూస్ కోసం దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘనుడు ఏకంగా విమానాన్ని కూల్చేశాడు. దీని మీద అధికారులు విచారణ చేపట్టినప్పుడు తనకేం తెలియదని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడంతోనే విమానం కూలిపోయిందని బుకాయించాడు. కానీ, అధికారులు వదలకుండా తమదైన స్టైల్లో ఆధారాలతో సహా అతడిని ప్రశ్నించడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు.
Read Also: Somesh Kumar: సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
వివరాల్లోకి వెళితే.. ట్రెవొర్ జాకబ్ అనే యూట్యూబర్ అమెరికాలోని ఒలంపిక్స్ స్నోబోర్డు క్రీడాకారుడు. అమెరికా తరఫున 2014లో రష్యాలోని సోచీలో జరిగిన వింటర్ ఒలంపిక్స్ స్నో బోర్డులో సెమీఫైనల్స్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా జాకబ్ పాల్గొన్నాడు. జాకబ్ కు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ లో ఎక్కువగా స్కై డైవింగ్, ఏవియేషన్, స్నో బోర్డింగ్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తాడు. ఇవి చాలా ఆసక్తిగా ఉంటుండడంతో చాలామంది అతడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2021 నవంబర్ 24న మరణించిన తన స్నేహితుడి బూడిదను వెదజల్లాలని చెప్పి లోంపోక్ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకు తీసుకుని బయలుదేరాడు. లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అందులో ఉన్న ట్రెవొర్ పారాషూట్ సహాయంతో తప్పించుకున్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిని అందరూ ఇది ప్రమాదం అనే మొదట అనుకున్నారు.
Read Also:Twitter New CEO: ట్విటర్ సీఈవోగా లిండా యాకరినో?.. ఇంతకీ ఆమె ఎవరంటే?
కాగా, 2021 డిసెంబర్ 24వ తేదీన అంటే సరిగ్గా ప్రమాదం జరిగిన నెల రోజులకి అతని యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. దాని టైటిల్ ‘నేను విమానాన్ని కూల్చి వేశాను’ అని ఉంది. అందులో విమానం ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయని దీంతో తాను పారాచూట్ సహాయంతో బయటకు దూకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అతను బయటికి దూకే సమయంలో సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఉండడం కనిపించింది. దీంతోపాటు విమానం లాస్ పాడ్రేస్ నేషనల్ పార్క్ సమీపంలో కూలడాన్ని కూడా అందులో పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలుభాగాల్లో కెమెరాలు అమర్చి.. ఈ ప్రమాదాన్ని చిత్రీకరించాడు. వీడియో చివర్లో… ‘ఈ ప్రమాదం నుంచి నేను సురక్షితంగా బయటపడినందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విమాన శిధిలాల వద్దకు చేరుకుని వాటిని కూడా వీడియో తీశాడు. విమానంలో అమర్చిన కెమెరాలు నుంచి డేటా పూర్తిగా తీసుకున్నాడు.
Read Also:Talasani Srinivas: డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకోవద్దు.. వాటి విలువ కోట్లలో ఉంది
అయితే ఈ విమాన ప్రమాదం మీద కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఆ విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడగగా.. అది ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్ తెలిపాడు. ఆ తర్వాత ఓ హెలికాప్టర్లో తన మిత్రులతో కలిసి విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి వాటి శకలాలను వేరే ప్రదేశానికి మార్చాడు. వాటిని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మిగిలిన విమాన భాగాలను విమానాశ్రయం, మరి ఇతర ప్రదేశాల్లోని చెత్తలో పడేశాడు. దీని మీద అప్పటినుంచి దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ దర్యాప్తు బృందం 2022లో విమానాన్ని జాకబ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని నిర్ధారించింది. అతను లోంఫోక్ విమానాశ్రయానికి వచ్చేటప్పుడే భారీ పారా చ్యూట్ తో వచ్చాడని గుర్తించింది. విమానాశ్రయంలో ఉన్నవారు చిన్న సీటు విమానంలో పారాచూట్ ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. అతని విమానానికి ముందే కెమెరాలు అమర్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. ఎట్టకేలకు ట్రెవొర్ ఫెడరల్ దర్యాప్తు బృందం ఎదుట తప్పును అంగీకరించాల్సి వచ్చింది. ఇక ఈ కేసులో ట్రెవొర్ కు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
- Tags
- Likes
- plane crash
- subcribe
- USA
- Video
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?