YouTube: ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో ప్లాట్ఫామును అందిస్తున్న యూట్యూబ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మరిన్ని ఫ్యూచర్ లోను అందిస్తుంటుంది. యూట్యూబ్ ప్రీమియమ్ వినియోగదారులకు కొత్తగా ‘Recommended Videos in Queue’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ ద్వారా, మీరు చూస్తున్న వీడియోలతో సరిపోలే వ్యక్తిగత రికమెండేషన్లు మీ క్యూలోనే ప్రత్యక్షమవుతాయి. దీని వలన కొత్త వీడియోలను కనుగొనడం మరింత సులభమవుతుంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో తర్వాత మీరు చూడాలని అనుకున్న వీడియోను ఎంపిక చేసుకుని “Add to queue” బటన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూట్యూబ్ యాప్‌లో Queue విభాగాన్ని తెరిచి చూడండి. ఇప్పుడు మీ క్యూలో మీరు చూసే అలవాట్లను బట్టి ప్రత్యేకమైన సిఫార్సులు అందించబడతాయి.
Read Also: Hero Karizma XMR 250: స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న హీరో కరిజ్మా XMR 250
యూట్యూబ్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కూడా ఉంది. అదే Faster Playback Speeds. ఈ ప్రయోగాత్మక ఫీచర్‌ను ఏప్రిల్ 7వ తేదీ వరకు పొడిగించింది యూట్యూబ్. ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు గరిష్టంగా 4x వేగంతో వీడియోలను వీక్షించగలుగుతారు. అంతేకాకుండా, 0.05 ఇన్‌క్రిమెంట్స్ లో స్పీడ్‌ను మార్చుకునే సౌకర్యం కూడా అందించనుంది. ఇది వినియోగదారులకు మరింత అనువైన వీక్షణ అనుభూతిని అందిస్తుంది. యూట్యూబ్ ప్రీమియమ్ వినియోగదారులు ఈ ఫీచర్లను యూట్యూబ్ యాప్ లేదా సైట్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌తో, యూట్యూబ్ ప్రీమియమ్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవం లభించనుంది. ఇంకెందు ఆలశ్యం మీరు కూడా ఈ ఫీచర్‌ను ఒకసారి పరీక్షించి చూడండి.