NTV Telugu Site icon

Hyderabad: బాచుపల్లిలో గన్‌తో యువకుల హల్చల్..

Bachupalli

Bachupalli

హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ ఘటనపై విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు.. యువకుల వీరంగంపై కాలనీ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా.. గన్‌తో హల్చల్ చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

Read Also: AP Rains: బలహీనపడిన అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..

కాగా.. యువకులకు తుపాకీ ఎక్కడి నుండి వచ్చింది.. యువకులు ఎవరూ అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు నాయకులు మేనేజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read Also: TG High Court: గ్రూప్-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Show comments