Crime: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్‌తో బాది దారుణ హత్య…
- ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణం
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్‌తో బాదిన అన్న
- తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ.. తమ్ముడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటనలో అన్న రాజు పాల్ తన తమ్ముడు ఉమేష్ పాల్ తలపై స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. మృతుడి కోడలు బిందు కథనం ప్రకారం.. అక్టోబర్ 15 సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు వెదురు అమ్ముకున్నారు. రాజేష్‌తో వెదురు అమ్మిన డబ్బు ఉంది. అన్నయ్య రాజు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఉమేష్ నిద్రకు ఉపక్రమించాడు. ఇదే అవకాశంగా భావించిన రాజు తలపై స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమేష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే రాజ్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది.
READ MORE: NIMS : నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
అన్నదమ్ములిద్దరూ మద్యం మత్తులో
ఘటన జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) ఓపీ సింగ్ తెలిపారు. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజు స్క్రూడ్రైవర్‌తో తలపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడని చెప్పారు. ఘటనానంతరం గాయపడిన ఉమేష్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఈ కేసులో నిందితుడు రాజుపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ తెలిపారు.
READ MORE: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!