దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Read Also: Misbehave: యువతికి ముద్దు పెట్టేసిన ర్యాపిడో డ్రైవర్
పూర్తి వివరాల్లోకి వెళితే…దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వాయి- వరుస లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ అమలు చేసినా, కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళలు కనిపిస్తే, రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ.. ఆమె లైంగికంగా వేధించాడు. అయితే.. ఆ కామాంధుడు చేస్తున్న వికృత చేష్టలను వీడియో తీసింది. అనంతరం అతడిని చెంప దెబ్బలతో వాయించింది. జరిగిన విషయాన్ని ఆమె కండక్టర్ కు చెప్పింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగినట్లు సమాచారం. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలని కామెంట్లు పెడుతున్నారు.
He deserved at least 10 more slaps and pervert men who molest women like this in public totally deserve thrashing in front of all along with an FIRpic.twitter.com/ietL98BTzN
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 6, 2025