Viral News: రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని.. హోర్డింగ్ ఎక్కిన యువకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A man put up a hoarding in Nizamabad for not returning Rs 1000: సాధారణంగా అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా చేబదులుగా ఇచ్చిన డబ్బును ఇవ్వకుంటే.. బ్రతిమిలాడుతారు లేదా బెదిరిస్తారు. ఎక్కువ మొత్తం అయితే పంచాయితీ కూడా పెడుతారు. అయితే ఓ యువకుడు కేవలం రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని పెద్ద సాహసమే చేశాడు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాలను తిరిగి ఇవ్వడం లేదని ఏకంగా భారి హోర్డింగ్ ఎక్కాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… నిజామాబాద్ మూడో ఠాణా పరిధిలో రవీందర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పెయింటింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రవీందర్ తన నివాసం దగ్గరలో రోడ్డు పక్కనే ఉన్న ఓ పెద్ద హోర్డింగ్ ఎక్కాడు. హోర్డింగ్‌పై కాలుమీద కాలేసుకుని పడుకున్నాడు. ఇది చూసిన జనాలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడి చేరుకుని రవీందర్‌తో మాట్లాడారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Also Read: Bus Accident: బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురు మృతి!
సీఐ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సాయంతో రవీందర్‌ను హోర్డింగ్ పైనుంచి కిందకు దింపారు. హోర్డింగ్ ఎందుకు ఎక్కావని సీఐ అడగగా.. ఓ వ్యక్తి రూ. 1000 ఇవ్వాల్సి ఉందని, కానీ ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని చెప్పాడు. ఇది విన్న అక్కడున్నవారు ఒక్కసారిగా విస్తుబోయారు. సీఐ రవీందర్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపించారు. రవీందర్ గతంలోనూ హోర్డింగ్ ఎక్కినట్లు స్థానికులు చెప్పారు. అతడు మద్యానికి బానిసైనట్లు కూడా తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!