సోషల్ మీడియా లో క్రేజ్ ను పెంచుకోవడం కోసం జనాలు రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే అన్న జిమ్ లలో ఇప్పుడు అమ్మాయిలు కూడా బాడీ షేపులు కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి జిమ్ లో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను చేసింది. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆ అమ్మాయి చేసిన విన్యాసం చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..ఓ జిమ్ సెంటర్‌లో ఓ యువతి విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమైంది. కింద ఓ వ్యక్తి పడుకుని ఉండగా.. ఆ యువతి అతడికి ఎదురుగా ఉన్న ఇనుప స్టాండ్ పట్టుకుని విన్యాసం చేసింది. ఇనుప స్టాండ్‌ను పట్టుకుని అటూ ఇటూ వేలాడుతూ వేగం అందుకోగానే ఒక్కసారిగా చేతులు వదిలేసి గాల్లోనే గింగిరాలు తిరిగింది. ఇలా రౌండ్లు తిరుగుతూ చివరకు సరిగ్గా కింద పరుపుపై పడుకుని ఉన్న యువకుడి మీద దూకేస్తుందని అనుకున్నా కానీ చాకచక్యంగా స్టంట్ ను పూర్తి చేసి అందరిని అవాక్కాయ్యేలా చేస్తుంది..
అతడి తలకు ఓ కాలు అటు వైపు, ఇంకో కాలు ఇటు వైపు పెట్టి అలాగే నిలబడుతుంది. ఈ క్రమంలో పడుకుని ఉన్న వ్యక్తి.. ఎక్కడ మీద పడుతుందో అని భయపడతాడు. అయితే ఆమె మాత్రం ఈ విన్యాసాన్ని చాకచర్యంగా చేసేసింది.. అయితే ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అతనికి చావును చూపించావు కదా తల్లి అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.. మొన్నీ ఆ మధ్య ఓ మహిళ చీరలో జిమ్ లో విన్యాసాలు చేసి షాకిచ్చింది.. ఇలా అమ్మాయిలు ఎక్కడో చోట చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు..