Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి సొంత డిఫెన్స్ సెక్రటరీని బాధ్యుడిని చేసిన ట్రంప్
- ఇరాన్ యుద్ధానికి హెగ్సెత్‌ను బాధ్యుడిని చేసిన ట్రంప్
- ట్రంప్ తన క్యాబినెట్ సభ్యుడిని బస్ కిందకు నెట్టేశారు” అని విమర్శిస్తున్నారు
- స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు సరఫరా ప్రభావితమవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి బాధ్యుడిగా చూపించారు. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో జరిగిన “Safe Task Force” రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హెగ్సెత్ అక్కడే పక్కన కూర్చుని ఉన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో, ట్రంప్ ఇరాన్ సర్వోన్నత నాయకుడితో సహా పలువురు ప్రముఖ ఇరాన్ నాయకులను హతమార్చారు. ఇరాన్‌పై దాడి చేయమని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌ను ప్రేరేపించారని గతంలో ఆరోపణలు వినిపించాయి. కానీ ఇప్పుడు, యుద్ధం ప్రారంభించమని తనను ఎవరు ప్రోత్సహించారో ట్రంప్ స్వయంగా వెల్లడించడంతో హాట్ టాపిక్ గా మారింది.
Also Read:Sourav Ganguly: “ఇంత కఠినంగా ఉండొద్దు”.. కోచ్ గంభీర్‌కు గంగూలీ కీలక సలహా
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
యుద్ధం ప్రారంభించమని తనకు సలహా ఇచ్చిన మొదటి వ్యక్తి అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ అని ట్రంప్ మీడియాతో చెప్పారు. ఇరాన్ గురించి తన ఆందోళనలను తన అగ్ర మంత్రులకు తెలియజేశానని అధ్యక్షుడు తెలిపారు. ట్రంప్ ఇలా అన్నారు, “నేను పీట్‌కు, జనరల్ కేన్‌కు, ప్రముఖులు చాలా మందికి ఫోన్ చేశాను. మనకు గొప్ప వ్యక్తులు ఉన్నారు. నేను ‘మాట్లాడుకుందాం’ అని చెప్పాను. మధ్యప్రాచ్యంలో మనకు ఒక సమస్య ఉంది. ఇరాన్ అనే దేశం 47 సంవత్సరాలుగా భయోత్పాతం సృష్టిస్తోంది. వారు అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి చాలా దగ్గరగా ఉన్నారు.” ఆ 50,000 సంఖ్యను 55 లేదా 60కి పెంచవచ్చని, లేదా మధ్యప్రాచ్యంలోని ఈ ప్రధాన సమస్యను ఆపి , నిర్మూలించవచ్చని తాను తన నాయకులకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.
ట్రంప్ మాట్లాడుతూ.. “పీట్, నేను అనుకుంటున్నాను నువ్వే మొదట మాట్లాడావు. ‘Let’s do it’ అని చెప్పావు. ఎందుకంటే వాళ్లు న్యూక్లియర్ ఆయుధం కలిగి ఉండకూడదు.”ఈ వ్యాఖ్యలు ఇరాన్ యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన సమయంలో వచ్చాయి. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఈ సైనిక చర్యలు ఇప్పుడు ఎక్కువ మంది అమెరికన్లలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేపట్టినట్లు ఇప్పటి వరకు చెబుతున్నారు. కానీ ఇప్పుడు బాధ్యతను తన డిఫెన్స్ సెక్రటరీ మీదకు మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఈ వ్యాఖ్యలను చాలా మంది “ట్రంప్ తన క్యాబినెట్ సభ్యుడిని బస్ కిందకు నెట్టేశారు” అని విమర్శిస్తున్నారు. యుద్ధం ఇప్పుడు అన్ పాపులర్ అవుతుండడంతో బాధ్యతను మరొకరి మీదకు మార్చడం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. హెగ్సెత్ మాత్రం ఈ సమావేశంలో ఏమీ స్పందించలేదు. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు సరఫరా ప్రభావితమవుతోంది. గ్లోబల్ మార్కెట్లు, ఆయిల్ ధరలు కూడా హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..