Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ఎప్పుడూ కూల్‌గా, ఎంతో హుందాగా ఉండే నటి దియా మీర్జా ఒక్కసారిగా తన సహనం కోల్పోయింది. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దియా, ఏకంగా నవాజుద్దీన్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రవర్తనపై దియా మీర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. “ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా ఒక పీడకల లాంటిది. కనీసం మాట్లాడే పద్ధతి కూడా తెలియదు, యాటిట్యూడ్ అయితే ఏకంగా ఆకాశాన్ని తాకుతోంది. అత్యంత అభ్యంతరకరమైన పాత్ర (క్యారెక్టర్) ఇది” అంటూ దియా రాసుకొచ్చింది. కూల్‌గా ఉండే దియా నోటి నుండి ఇంతటి తీవ్రమైన మాటలు రావడంతో నెట్టింట ఒక్కసారిగా చర్చ మొదలైంది.
దియా మీర్జా చేసిన ఈ విమర్శలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా అంతే వేగంగా, ఘాటుగా స్పందించాడు. ఆమె పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. “ఒకరి యాటిట్యూడ్‌లో లోపాలు వెతకడం చాలా తేలిక.. దమ్ముంటే నా పనిలో తప్పులు వెతికి చూపించండి” అంటూ సవాల్ విసిరాడు. ఇద్దరు దిగ్గజ నటుల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ ఎంతో ప్రొఫెషనల్ నటులని, ఇలా బహిరంగంగా తిట్టుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
Also Read
- Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
- Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. "రేపు నా కల నిజమవుతోంది"!
- Varanasi: రాజమౌళి - మహేశ్ 'వారణాసి'కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
- Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
అయితే, దియా తన పోస్ట్‌లో వాడిన ‘పాత్ర’ (క్యారెక్టర్) అనే పదాన్ని కొందరు నెటిజన్లు ప్రత్యేకంగా గమనించారు. వీరిద్దరూ కలిసి రోహన్ సిప్పీ దర్శకత్వంలో ‘డాక్టర్ హసన్’ (Dr. Hasan) అనే మెడికల్ డ్రామా వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ ‘డాక్టర్ ఇమ్రాన్ హసన్’గా, దియా ‘డాక్టర్ పలక్ జైన్’గా కనిపించనున్నారు. డిసెంబర్ 27న జియోహాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో, సిరీస్‌లోని నవాజుద్దీన్ పాత్ర స్వభావాన్ని ఉద్దేశించే దియా ఈ కామెంట్స్ చేసి ఉంటుందని, ఇది కేవలం ప్రమోషన్లలో భాగంగా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, వీరిద్దరి ఈ ‘సోషల్ మీడియా వార్’ మాత్రం రాబోయే సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.
తాజావార్తలు
-
Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
-
Kishan Reddy : పేద విద్యార్థుల భవితకు భరోసా.. 4,741 మంది టెన్త్ విద్యార్థులకు ఫీజు చెల్లించిన కిషన్ రెడ్డి
-
Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
-
Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
-
Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..