PF Withdraw: ఇలా చేస్తే.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఇందులో మనం పనిచేసే కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం వరకు కట్ చేసుకుంటుంది. సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం-ఈపీఎఫ్‌ఓ వడ్డీ యాడ్ చేస్తుంది. అయితే మన అవసరాల కోసం.. మనం డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ ఈ అవకాశం కల్పిస్తోంది. పెళ్లి, ఆస్పత్రి ఖర్చుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, చదువు కోసం.. ఇలా పలు కారణాలతో విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది తమకు అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చూస్తూనే ఉంటాం.
Read Also: Pooja Hegde : మాస్ రాజా రవితేజ సినిమాలో నటించబోతున్న బుట్టబొమ్మ..?
Also Read
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
అయితే ఏ కారణానికి ఎంత తీసుకోవచ్చనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. చాలా వరకు మనీ క్లెయిమ్ చేస్తుంటారు. ఎంత వస్తుందనేది ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మనకు ఏ కారణంపై ఎంత వరకు డబ్బులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. ఈపీఎఫ్ ఖాతాదారులు.. పెళ్లి కోసం 50 శాతం వరకు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విత్‌డ్రా కోసం మాత్రం ఏడేళ్ల సర్వీస్ పూర్తై ఉండాలి. ఈపీఎఫ్ సభ్యుడు లేదా వారి కొడుకు/కూతురు/సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఉన్నత చదువుల కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు.
Read Also: Aasara Pension: దివ్యాంగులకు శుభవార్త.. ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్
అయితే, కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేందుకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.. ఇక్కడ ఐదేళ్ల సభ్యత్వం అవసరం. ఇంటి స్థలం కొనుగోలు చేసినందుకు.. నెలవారీ జీతం కంటే 24 రెట్లు, ఇల్లు కొనుగోలు చేసేందుకు మాత్రం 36 రెట్ల వరకు డ్రా చేసుకోవచ్చు.. ఇంటి నిర్మాణానికి 36 రేట్లు వస్తుంది.. ఇంటి నిర్మాణం కోసం మాత్రం నెల జీతం కంటే 12 రెట్లు డ్రా చేయొచ్చు. ఇక ఆస్పత్రి ఖర్చుల కోసం కూడా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. ఉద్యోగి నెలవారీ జీతానికి 6 రెట్లకు సరిపడా నగదును తీసుకోవచ్చు.. ఇంకా సదరు ఉద్యోగి మరో సంవత్సరంలో రిటైర్ అయిపోతాడు అనుకున్నప్పుడు.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. అయితే.. రిటైర్మెంట్‌కు ఏడాది లోపే ఇది వర్తిస్తుందని మీరు గుర్తు పెట్టుకోవాలి.
తాజావార్తలు
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!