Pooja Hegde : మాస్ రాజా రవితేజ సినిమాలో నటించబోతున్న బుట్టబొమ్మ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ రాజా రవితేజ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ వంటి ఆల్ట్రా మాస్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.. గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్టుగా వారు ప్రకటించారు.. అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ ను కూడా విడుదల చేయగా ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తున్నట్టు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక పై వెతుకులాట ప్రారంభించారు.మాస్ రాజా సరసన హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం..అన్ని సెట్ అయితే ఈసారి బుట్టబొమ్మ మాస్ రాజాతో కలిసి నటించడం ఖాయంగా కనిపిస్తుంది.. అయితే పూజా హెగ్డే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది.మరి పూజా తన పాత్ర నచ్చితే ఓకే చెప్పే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది..
గోపిచంద్ మలినేని, రవితేజ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా వున్నారు. ప్రస్తుతం రవితేజ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేస్తుండగా సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతుంది. అలాగే ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమాను కూడా రవితేజ ప్రకటించారు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది…మరోసారి రవితేజ బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!