Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
- హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం..
- భారత్‌కు ఈ వ్యాఖ్యలు ప్రమాదకరమని విమర్శ..
- నెహ్రూ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ అన్సారీ చేసిన కామెంట్స్‌పై వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఏజీ నూరానీ స్మారక ఉపన్యాసంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన పాత వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఏజీ నూరానీ రచించిన ‘‘ ది ఆర్ఎస్ఎస్: ఏ మెనేస్ టూ ఇండియా’’ పుస్తకాన్ని ఉటంకిస్తూ.. కమ్యూనిజం కంటే హిందూ మితవాద మతతత్వమే భారతదేశానికి ముప్పుగా నెహ్రూ పేర్కొన్నారని అన్సారీ తెలిపారు. ఇవి తన వ్యాఖ్యలు కాదని నెహ్రూ చేసిన వ్యాఖ్యలు అని అన్నారు.
అయితే, అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు భగ్గుమంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్సారీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్సారీ ప్రస్తావన సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సంప్రదాయాలను అవమానించడంతో పాటు హిందువులను ఉగ్రవాదంతో ముడిపెట్టే ప్రయత్నం అని యోగి ఆరోపించారు. భారతదేశ గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని, దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడుతాయని ఆయన ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై ముస్లిం మతపెద్దతు కూడా విమర్శలు చేస్తున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
ఇండోర్ స్టూడెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై కూడా యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి, రాహుల్ తో కలిసి చేసిన స్కిట్ వివాదంగా మారింది. ప్రజా జీవితంలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని అన్నారు. మహిళా గౌరవాన్ని గుర్తుచేస్తూ.. ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:’’ అనే సూక్తిని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!