రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు.. ఈ మధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన.. తెలుగుదేశం, జనసేన పొత్తుల నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. ఇక, ఇదే సమయంలో.. తన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. తాజాగా శ్రీ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలో తిరుమల 31వ పాదయాత్రలో పాల్గొన్నారు.. అంతేకాకుండా.. 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజంపేట నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అక్కడి ప్రజల అభిమానాన్ని సంపాదించారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి.. రాజంపేట నుంచి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.. ఇప్పుడు శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేని ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నారు యల్లటూరు శ్రీనివాస రాజు