Anakapalli: మరికొన్ని గంటల్లో 2025 ఏడాదికి బై బై చెప్పబోతున్నాం. కొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఇయర్ ఎండ్‌లో ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వండర్ బేబీ జన్మించింది. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నార్మల్ డెలివరీలోనే 4.8 కిలోల బరువుతో మగ శిశువుకు తల్లి జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత అధిక బరువుతో ఉన్న శిశువులకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి, గర్భిణీకి సురక్షితంగా సహజ ప్రసవం చేయించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అరుదైన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ స్పందించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఇది నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
READ MORE: LeT leader: “భారత్ మా ఉగ్రస్థావరాలను నాశనం చేసింది”.. సిందూర్ దాడులను ఒప్పుకున్న లష్కరే తోయిబా..