Chandrababu: వైసీపీ సినిమా అయిపోయింది.. సీఎంపై చంద్రబాబు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. టీడీపీ-జనసేన జైత్ర యాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగున్నర ఏళ్లలో సమాజంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. మరోవైపు.. పెట్రోల్, కరెంట్ ధరలు పెంచారు.. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అని విమర్శించారు.
Read Also: Minister Bosta: మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు..
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
ఇదిలాఉంటే.. మీటింగ్ పెట్టుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే విజిలెన్స్ ను పంపించాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆక్వా రంగాన్ని టీడీపీ అభివృద్ధి చేస్తే.. వైసీపీ వాళ్ళు సాగు ఖర్చు మూడు రెట్లు పెరిగేలా చేసి ఆక్వా రంగాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. పండించిన పంట తరలించేందుకు గోనె సంచులు సైతం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు.
Read Also: Iran: హిజాబ్ సరిగా ధరించలేదని మహిళకు 74 కొరడా దెబ్బలు..
మరోవైపు.. తమ హయాంలో పోలవరం పనులు పరుగులు పెట్టించాం.. 2019 నుంచి పోలవరానికి గ్రహణం పట్టిందని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు.. పోలవరానికి గ్రహణం పోవాలంటే జగన్ పోవాలి అని అన్నారు. మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తా అని భూం భూమ్ తీసుకు వచ్చారు.. మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.. అది జగన్ విశ్వాసనీయత అని విమర్శలు కురిపించారు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతా అని ఎస్మా ప్రయోగిస్తున్నారు.. యువతకు జాబ్ క్యాలండర్ అని ఐదేళ్లలో ఒక ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- chandrababu
- jagan
- tdp
- telugu news
- ycp
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!