భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. యశస్వి అరంగేట్రంలోనే అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. బెన్ డకెట్ క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బెన్ డకెట్‌ను క్యాచ్‌ను పట్టుకున్న తీరుపై యశస్విని అందరూ ప్రశంసిస్తున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ పట్టుకున్న క్యాచ్‌తో పోలుస్తున్నారు. ఏదేమైనాప్పటికీ.. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Read Also: Vishwak Sen: నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి జంప్?
మరోవైపు.. ఇంగ్లాండ్ పై వన్డే అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా కూడా తన అరంగేట్రంలో విశేషంగా రాణించాడు. ఒకే ఓవర్లోనే 26 పరుగులు సమర్పించుకున్న హర్షిత్ రాణా.. ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇది వన్డే అరంగేట్రంలో ఒక భారత బౌలర్ వేసిన అత్యంత ఖరీదైన ఓవర్. అనంతరం.. హర్షిత్ కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ముందుగా డకెట్‌ను యశస్వి క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ తర్వాత.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసి ఇంగ్లీష్ జట్టుకు డబుల్ దెబ్బ కొట్టాడు. మొత్తం 7 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా.. ఒక ఓవర్ మెయిడిన్ చేసి 53 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
https://twitter.com/deolsforever/status/1887430409203359756
Read Also: Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..