Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..
- అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి..
- కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఆర్డీఏ లేఖ..
- సీఆర్డీఏ లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం..
- టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడి..
- కానీ, ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Election Commission: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సీఆర్డీఏ.. అయితే, సీఆర్డీఏ రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది.. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసీకి సీఆర్డీఏ లేఖ రాసిన విషయం విదితమే కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తర్వాత మాత్రమే రాజధాని టెండర్లను ఫైనలైజ్ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. దీంతో రాజధాని నిర్మాణ పనులు కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.. ఈ నెలలోనే రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావించింది ఏపీ ప్రభుత్వం.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది..
Read Also: AP Ministers Ranks: ఆరో స్థానంలో చంద్రబాబు.. పదో స్థానంలో పవన్ కల్యాణ్..
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
కాగా, గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఆ పనులను వేగవంతం చేసింది.. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన.. కొన్ని పనులు చేపట్టింది.. ప్రాధాన్యతా క్రమంలో రాజధాని ప్రాంతంలో పనులు వేగవంతం చేసింది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారిపోయింది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా – గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ.. వివిధ జోన్ల పరిధిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేపట్టాం.. ఎల్పీఎస్ లే ఔట్లలో రోడ్లు.. మంచినీటి సరఫరా.. డ్రైన్లు.. విద్యుత్ ప్లాంటేషన్.. ఇలా కొన్ని పనులు మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. ఈసీకి సీఆర్డీఏ లేఖ రాయగా.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?