Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం!
- యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం
- ముంబై జట్టుకు యశస్వి వీడ్కోలు
- ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2025-26 సీజన్‌లో గోవాకు ఆడాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) మంగళవారం యశస్వి లేఖ రాశాడు. యశస్వి నిర్ణయానికి ఎంసీఏ ఆమోదం తెలుపుతూ ఎన్‌ఓసీ కూడా మంజూరు చేసింది. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన విషయం తెలిసిందే.
Also Read: RCB vs GT: విజృంభించిన సిరాజ్, దంచేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం!
Also Read
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘ఇది నిజంగా ఆశ్చర్యకర పరిణామం. ఈ నిర్ణయం వెనుక యశస్వి జైస్వాల్ ఎంతగానో ఆలోచించే ఉంటాడు. తనను విడుదల చేయాలన్న యశస్వి విజ్ఞప్తికి ఎంసీఏ నుంచి ఆమోదం తెలిపాం’ అని చెప్పారు. ‘యశస్వి జైస్వాల్‌ను మేం స్వాగతిస్తున్నాం. వచ్చే సీజన్ నుంచి యశస్వి గోవా తరఫున ఆడతాడు. టీమిండియా మ్యాచులు లేనప్పుడు గోవాకు యశస్వి సారథ్యం వహిస్తాడు’ అని గోవా క్రికెట్ సంఘం కార్యదర్శి శంబా దేశాయ్ తెలిపారు. భారత క్రికెటర్లు దేశవాళీలో ఆడటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. చివరగా జమ్ముకశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తరఫున యశస్వి 4, 26 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
-
CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..