Ramayana Movie:’రామాయణ’ షూటింగ్ పై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కన్నడ సూపర్ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ప్రపంచవ్యాప్త స్థాయికి తీసుకెళ్లగా, మేకర్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్లను మొదలుపెట్టారు.
Also Read :Arya: వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు
Also Read
- Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంటర్వ్యూలో యష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో తన కాంబినేషన్ సీన్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు రణబీర్‌కు, తనకూ మధ్య ఒక్క సీన్ కూడా చిత్రీకరించలేదని యష్ వెల్లడించారు.. ‘ఇది రెండు భాగాలుగా వస్తున్న సినిమా. ఇందులో ఇద్దరికీ వేర్వేరు రాజ్యాలు (అయోధ్య, లంక) ఉంటాయి. కథాక్రమం ప్రకారం మొదటి భాగంలో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఇంకా రాలేదు’ అని ఆయన వివరించారు. కానీ షూటింగ్ పరంగా ఇద్దరూ కలవకపోయినప్పటికీ, సెట్స్‌లో కలిసినప్పుడు మాత్రం తమ మధ్య మంచి అనుబంధం ఉంటుందని, రణబీర్‌తో పని తీరు ఎంతో గొప్పగా ఉంటుందని యష్ చెప్పుకొచ్చారు. దీని బట్టి చేస్తే..
రాముడు, రావణుడు వెండితెరపై ఒకరినొకరు ఢీకొనే సన్నివేశాలు రెండవ భాగంలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యష్ మాటలను బట్టి అర్థమవుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్ సంగీతంలో రాబోతున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!