Pamela Chopra : సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. పమేలా ప్రసిద్ధ గాయని. ఆమె భర్త యష్ చోప్రా నిర్మాణంలోని అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. పమేలా చోప్రా మరణం గురించిన సమాచారం యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కూడా షేర్ చేశారు. ఇవాళ ముంబైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also: Andhra Pradesh Crime: అమ్మాయితో లవ్..! ఎగ్జామ్ హాల్‌లో 9వ తరగతి విద్యార్థిపై దాడి..
పమేలా చోప్రా వయసు 74 ఏళ్లు. గత 15 రోజులుగా ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రలో చికిత్స పొందారు. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. యశ్ చోప్రా 2012లో మృతి చెందారు. యశ్, పమేలా దంపతులది పెద్దలు కుదిర్చిన వివాహం. 1970లో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా ఉన్నారు. ఆదిత్య చోప్రా దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఉదయ్ చోప్రా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Also: CBFC: సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2023 పై సర్వత్రా హర్షం!