Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Fans of Yash Died in Karnataka while putting up a banner: కన్నడ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేజీయఫ్ హీరో యశ్‌కు సోమవారం ఉదయం బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అభ్యర్థిస్తున్నారు.
యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్‌డే నేపథ్యంలో యశ్ జనవరి 5న ఓ పోస్ట్ చేశారు. ‘ఫాన్స్ నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. నన్ను కలిసి విషెస్ చెప్పాలని ఆశపడుతున్నారు. మీతో కలిసి సమయాన్ని గడపడం నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి. అయితే జనవరి 8న నేను అందుబాటులో ఉండను. మనం మరో రోజు కలుద్దాం. ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి’ అని యశ్ ట్వీట్ చేశారు.
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్ 2024కు దూరం!
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986 జనవరి 8న కర్ణాటకలోకి బూవనహళ్లి అనే గ్రామంలో జన్మించారు. నటనపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కష్టపడ్డారు. 2000లలో అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. 2007లో ‘జంబడ హుడుగి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రాకీ, గూగ్లీ, మిస్టర్ అండ్ మిస్ రామాచారి సినిమాలతో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఇక కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలానే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!