Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన వారిలో వైవా హర్ష కూడా ఒకరు.. తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్నో సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ నటిస్తూ వస్తున్నాడు.. ఇటీవల సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. టైటిల్ రోల్ లో నటించిన హర్ష అదిరిపోయే పెర్ఫార్మన్స్ కు జనం ఫిదా అయ్యారు.. దాంతో సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకోలేక పోయింది..
ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరను అందుకున్నాయి.. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు (మార్చి 28) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ‘మాస్టారు.. మాస్టారు మీ మనసులను గెలవడానికి వచ్చేశారు.. అంటూ తాజాగా ఆహా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.. ఈ సినిమాను మొదట రెండు ఓటీటిల్లో విడుదల చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఫైనల్లీ ఆహాలోకి వచ్చేసింది.. థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లు ఇక్కడ చూసేయ్యండి..
Also Read
ఈ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైవా హర్షతో పాటు దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం కీలకపాత్రలు పోషించారు. ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్‍డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ఈ మూవీని నిర్మించారు.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రపంచంతో సంబంధం లేని ఓ అటవీ గ్రామానికి మాస్టారు గా వెళ్లిన హర్ష ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా కథ..
తాజావార్తలు
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!