Yanamala Ramakrishnudu: వైఎస్ జగన్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తోంది.. జగన్ వైఖరి వల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఏపీకి రావడం లేదు.. మరోవైపు.. వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల బీసీ వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయన్న ఆయన.. కొన్ని రంగాలకు వస్తోన్న కేంద్ర నిధులను ఏపీ దారి మళ్లిస్తున్నారు.. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు వచ్చే నిధులను పక్కదారి పట్టించారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం నుంచి వచ్చిన రూ. 71,449 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని.. అవినీతి, అక్రమాలు, దోపిడీకే కేంద్ర నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
Read Also: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఘటన.. మూడో రోజు కూడా కొనసాగతున్న సహాయక చర్యలు
వ్యక్తిగత ప్రచారం కోసం రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు యనమల.. కేంద్రం ఇచ్చే నిధులకు వైఎస్సార్, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవడంతో ఏపీకివ్వాల్సిన రూ. 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారు. 75 పథకాలకు జగన్, వైఎస్సార్ పేర్లు పెట్టడం రాచరిక పోకడ కాదా..? పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3084 కోట్లని దారి మళ్లించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం రూ. 900 కోట్లు రైతులకు చేరలేదు. రూ. 8660 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన రూ. 7879 కోట్లను దారి మళ్లించి.. వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోంది అంటూ ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.