WTC Final: లార్డ్స్ మైదానంలో బుధవారం (జూన్ 11)న ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2025లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి రోజు ఆట రసవత్తరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజుతోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read Also: Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..
ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే కష్టాలలో పడింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0), కామెరాన్ గ్రీన్ (4) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా, మానస్ లబుషేన్ (17) కూడా నిలదొక్కుకోలేకపోయారు. అయితే సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 112 బంతుల్లో 10 ఫోర్లు 66 పరుగులు, బియూ వెబ్‌స్టర్ 92 బంతుల్లో 11 ఫోర్లు 72 పరుగులతో మిడిలార్డర్ ను నిలబెట్టారు. ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పగా చివరికి ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పేసర్ కగిసో రబాడా అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీశాడు. అతడు 15.4 ఓవర్లలో 51 పరుగులకు 5 వికెట్లు తీసాడు. మరోవైపు జాన్సన్ మూడు వికెట్లు తీసి మద్దతు ఇచ్చాడు. మిగిలిన రెండు వికెట్లు మార్క్రామ్, మహరాజ్ తీసుకున్నారు.
Read Also: Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..
ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా అలానే తయారైంది. ప్రారంభంలో మార్క్రామ్ (0), రికెల్టన్ (16) స్టార్క్ రెండు కీలక వికెట్లు తీసాడు. ఆ తర్వాత ముల్డర్ (6)ను కమ్‌మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. హాజిల్ ఉడ్ ట్రిస్టన్ స్టబ్స్ (2)ను ఔట్ చేయగా.. దక్షిణాఫ్రికా 22 ఓవర్లలో 43/4తో నిలిచింది. కప్టెన్ టెంబా బవుమా (3), బెడింగ్హామ్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీనితో దక్షిణాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. మొదటి రోజంతా ఇరుజట్ల పేస్ దళం ప్రత్యర్థుల టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఇక రెండో రోజు తొలి సెషన్ మరింత కీలకం కానుంది. దక్షిణాఫ్రికా పునరాగమనం చేయగలుగుతుందా? లేక ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తుందా అనేది చూడాలి.