వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చినా.. ట్రిపుల్ రైడింగ్ చేసినా భారీ జరిమానులు విధించేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. అయితే.. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానాకు రంగం సిద్ధమైంది. రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే రూ.1700 లు జరిమానా, ట్రిపుల్ రైడింగ్ కు రూ.1200 జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో.. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : Delhi Liquor Scam: విజయ్ నాయర్, అభిషేక్ ఈడీ కస్టడీ పొడిగింపు.. రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆపరేషన్ రోప్ పేరిట పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గతంలో.. ట్రాఫిక్ అడ్డంకులు, అవరోధాలను అధిగమించడానికి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ స్థాయి నుంచి హోంగార్డు వరకు రోడ్ల పైకి వచ్చి వాహనదారులకు అవగాహన కల్పించారు. పలు కూడళ్లలో వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించారు పోలీసు ఉన్నతాధికారులు. ప్రధానంగా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు వాహనదారులు స్టాప్ లైన్ క్రాస్ చేయకుండా, ఫ్రీ లెఫ్ట్ ఉన్న దారిలో వాహనాలను అడ్డు రాకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝులిపించి చలానాలు వేస్తున్నారు. అయితే ఫ్రీ లెఫ్ట్‌ల విషయంలో అధికారులు తీసుకున్న చర్యలు పూర్తిగా సఫలం కాకపోవడం గమనార్హం.