WFI: భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వేదికపై భారత్‌కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్స్ ‘గా పోటీ పడాల్సి ఉంటుంది.
Read Also: NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
అయితే, గత కొంత కాలం నుంచి డబ్ల్యూఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆ సంస్థకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. వాస్తవానికి భారత రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన డబ్ల్యూఎఫ్ఐకు 2023 జూన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, భారత రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర యూనిట్ల లీగల్ పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదే పదే వాయిదా పడ్డాయి. రెజ్లింగ్ కు ప్రపంచ పాలక సంస్థ అయిన యూడబ్ల్యూడబ్ల్యూ.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడంతో రాబోయే వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ తరఫున ఆడేందుకు మన రెజర్లకు ఛాన్స్ ఉండదు.
Read Also: Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్‌కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఇక, డబ్ల్యూఎఫ్ఐ గవర్నింగ్ బాడీలోని 15 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీని కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు యూపీకి చెందిన సంజయ్ సింగ్ సహా నలుగురు అభ్యర్థులు సోమవారం ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ లో అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా చండీగఢ్ కుస్తీ సంఘానికి చెందిన దర్శన్ లాల్, కోశాధికారిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు ఉత్తరాఖండ్ కు చెందిన ఎస్పీ దేశ్వాల్ నామినేట్ అయ్యారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపించడంతో డబ్ల్యూఎఫ్ఐ బాడీని మొదట జనవరిలో, ఆ తర్వాత మేలో సస్పెండ్ చేసింది.
Read Also: TS Govt: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు
అయితే, డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీ చూసుకుంటుంది. కాగా.. ఎన్నికలు ఆలస్యమైతే సస్పెండ్ చేస్తామని గతంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఐకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసింది.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?