The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా నుండి విడుదలైన సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘ఏష నాగుల’ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను ఘనంగా దాటేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ఫోక్ బీట్స్‌కు.. జంగిరెడ్డి, ప్రభా బంగారిగళ్ల నాటు గాత్రం తోడవడంతో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా ‘దసరా’ తర్వాత నానితో కలిసి కీర్తి సురేష్ ఈ పాటకు ఇచ్చిన స్పెషల్ అప్పీయరెన్స్, ఆట సందీప్ మాస్ కొరియోగ్రఫీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకునేలా చేశాయి. టాలీవుడ్లో అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ సాధించిన పాటల్లో ‘ ఏష నాగుల’ సాంగ్ మొదటి ప్లేస్ లో నిలిచింది. గతంలో ‘పుష్ప’లోని ఊ అంటావా మావా, ‘దేవర’లోని చుట్టమల్లె, ‘అల వైకుంటపురములో’ బుట్ట బొమ్మా వంటి పాటలు కూడా భారీ వ్యూస్‌తో సంచలనం సృష్టించాయి. అయితే ఇంత తక్కువ సమయంలో ఈ రికార్డును అందుకోలేదు.
మరోవైపు ఈ సినిమా ఎలాంటి థియేట్రికల్ ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది. అయితే ఇప్పటికే వచ్చిన టీజర్, ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫైనల్ అవుట్‌పుట్ మరింత పర్ఫెక్ట్గా రావడానికి మేకర్స్ ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలాంటి వాయిదాలు లేకుండా అనుకున్న సమయానికే 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా మూవీ కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి ముందే ‘ఏష నాగుల’ సాంగ్ ఇంతటి రెస్పాన్స్ అందుకోవడం నాని అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తోంది. పాట వ్యూస్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో దాని ట్రెండ్, మాస్ బీట్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ‘ది ప్యారడైజ్’పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. మరి ఈ పాట సృష్టిస్తున్న హైప్‌ను సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల టీమ్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!