విమెన్స్ ఐపీఎల్ నిర్వహణ పనులపై బీసీసీఐ బిజీగా ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీల్ని ఖరారు చేసిన మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల వేలంపై దృష్టి సారించింది. ముంబైలోని ఓ హోటల్‌లో ఫిబ్రవరి 11 లేదా 13న ఈ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత్-న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20కి హాజరైన ఆయన ఈ విషయమై ఓ మీడియాతో మాట్లాడారు. “సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఫిబ్రవరి 11 లేదా 13న ప్లేయర్ ఆక్షన్ జరగనుంది. డేట్, ప్లేస్‌పై ఫ్రాంచైజీలు సౌకర్యంగా ఉన్నాయి. ఈ డేట్‌లో వేలం నిర్వహణ కోసం ఫ్రాంచైజీలకు కబురు పంపాం. దానికి తగినట్లు ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవాలని సూచించాం. ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి 11 లేదా 13 అనుకుంటున్నాం. ఇది కొత్త లీగ్ కాబట్టి గ్రౌండ్ వర్క్ బాగా జరగాల్సి ఉంటుంది. ప్రతి ప్లేయర్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది” అని చెప్పారు.
Also Read: Hanuma Vihari: అందుకే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశా: హనుమ విహారి
కాగా, విమెన్స్ ఐపీఎల్లో పాల్గొనే ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను బీసీసీఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరినట్లు పేర్కొంది. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లకు, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిపింది.
Also Read: Jammu Kashmir: లష్కరే ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్..