భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ గేమ్స్‌పై మాట్లాడారు. మరికొన్నేళ్లలో భారత్‌లో తొలి ఒలింపిక్స్‌ను చూడబోతున్నామని ప్రకటించారు. హర్యానా, సోనిపట్‌ల యువత స్వర్ణం గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఇవి తాగితే మీ వెంట్రుకలు త్వరగా తెల్లగా కావు..
తాను హర్యానా రోటీ తిన్నానని.. ఈ రాష్ట్ర తల్లులు మరియు సోదరీమణులకు రుణపడి ఉన్నానని చెప్పారు. ఈ రుణాన్ని తన కృషితో తీర్చుకుంటానని ప్రధాని ప్రకటించారు.
ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియా ప్రయత్నిస్తుందని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గతంలో తెలిపారు. ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించామని.. 2030లో యూత్ ఒలింపిక్స్‌కు, 2036లో ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | Haryana: Prime Minister Narendra Modi says, "…India is already working on a plan to host the 2036 Olympics in India. In a few years, we will see the first Olympics in India…In that, we will see the youth of Haryana and Sonipat winning gold…" pic.twitter.com/YqPTJP98xg
— ANI (@ANI) May 18, 2024