Noida murder case: ఎయిర్‌లైన్ ఉద్యోగి హత్య కేసులో ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!
- ఎయిర్‌లైన్ ఉద్యోగి హత్య కేసులో ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్
- జనవరి 19న సూరజ్ మాన్ నోయిడాలో హత్య
- గ్యాంగ్‌స్టర్ల మధ్య నెలకొన్న పగే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఎయిరిండియా ఉద్యోగి సూరజ్ మాన్ (30) హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. 8 నెలల తర్వాత ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఆమె ఎవరు? ఈ హత్య వెనుక ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. నోయిడాలోని జిమ్ నుంచి సూరజ్ మాన్.. కారులోకి వచ్చి కూర్చోగానే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకు ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు కావడం విశేషం. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో పగ ప్రతీకారాలు నడుస్తున్నాయి. తన తండ్రిని పర్వేష్ మాన్ చంపాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్రణాళిక వేశాడు. అంతే తన భాగస్వామి అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ఫ్లాన్ అమలు చేశాడు. ఇదిలా ఉంటే కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. సూరజ్ మాన్ హత్య తర్వాత.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు గుర్తించారు. సూరజ్ మాన్… జైల్లో ఉన్న తన సోదరుడికి ఆర్థిక సాయం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.
కాజల్ ఖత్రీ తలపై రూ.25,000 పారితోషికం ఉందని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి సంజయ్ భాటియా తెలిపారు. జనవరి 19న నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. కపిల్ మాన్ సూచన మేరకే ఇద్దరు హంతకులు సూరజ్ మాన్ చంపినట్లు తెలిపారు. జైల్లో ఉన్న కపిల్ మాన్.. కాజల్ ఖత్రీతో తన గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. పర్వేష్ మాన్, కపిల్ మాన్‌ల మధ్య శత్రుత్వం చాలా ఏళ్ల నాటిదని ఆయన అన్నారు. కపిల్ మాన్ తండ్రి హత్య వెనుక పర్వేష్ మాన్ ఉన్నాడని.. దానికి ప్రతీకారంగా కపిల్ మాన్.. పర్వేష్ సోదరుడిని చంపినట్లు చెప్పుకొచ్చారు. ఇక కాజల్ ఖత్రీ తనను తాను కపిల్ మాన్ భార్యగా పరిచయం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. కపిల్ మాన్ కూడా జైలు రికార్డులో కాజల్ ఖత్రీని భార్యగా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!