Matrimonial Fraud : ఒకప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడుతాయి అంటారు. ప్రస్తుతం మాట్రిమోనియల్ సైట్లే పెళ్లి నిశ్చయిస్తున్నాయి. చాలా మందికి వాటి ద్వారా మంచి సంబంధాలు దొరికినా.. కొంత మంది మాత్రం మోసపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. చెన్నైలోని డాక్టర్ కి అమెరికాలోని ఓ యువతి పెళ్లి పేరుతో కుచ్చుటోపి పెట్టింది. పుదుచ్చేరికి చెందిన డాక్టర్ దగ్గర నుంచి రూ.35 లక్షలు కొట్టేసింది. మొదటి పెళ్లి అచ్చి రాలేదనుకుంటే.. రెండో పెళ్లి ట్రయల్స్ లోనే బెడిసి కొట్టడంతో డాక్టర్ కంగుతిన్నాడు.
Read Also: Covid cases: దేశంలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?
వివరాలలోకి వెళితే.. బాలాజీ పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. మొదటి పెళ్లి విఫలం కావడంతో అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇందుకు మాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది చూసిన అమెరికాలోని సోమశ్రీ నాయర్ అనే యువతి బాలాజీతో కాంటాక్ట్ అయింది. బాలాజీకి అప్పటికే వివాహమై భార్యాభర్తల మధ్య గొడవలొచ్చి విడిపోయారు. వయసు 36 ఏళ్లే కావడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో బంధువులు బాలాజీకి సూచించారు. దీంతో రెండో పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీలో తన పూర్తి వివరాలు నమోదు చేశాడు. దీంతో బాలాజీది హై ప్రొఫైల్ కావడంతో చాలా కాల్స్, మెసేజ్ లు వచ్చేవి. ఈ విధంగానే బాలాజీకి సోమశ్రీ పరిచయమయ్యింది. తాను అమెరికాలో డాక్టర్ చదువుకున్నానని చెప్పింది. ప్రస్తుతం సిరియాలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపింది. ఇద్దరిది ఒకే వృత్తి కావడంతో బాలాజీకి సోమశ్రీ అంటే ఇష్టం ఏర్పడింది.
Read Also: Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
ముందు ఒకరినొకరం అర్థం చేసుకుని నచ్చితే పెళ్లి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అన్నట్లుగానే చాలాకాలం ఇద్దరు మాట్లాడుకున్నారు. రానురాను బాలాజీకి ఆ అమ్మాయిపై ఇష్టం పెరిగింది. మొదటి పెళ్లి వల్ల తనకు కలిగిన మానసిక క్షోభకు సోమశ్రీ మందు అని బాలాజీ బలంగా నమ్మాడు. సోమశ్రీ తనకు హఠాత్తుగా డబ్బు అవసరం వచ్చిందని బాలాజీని వివిధ దఫాలుగా రూ.35 లక్షలు అడిగినట్లు సమాచారం. ఈ డబ్బు ఆమెకు అందిన తరువాత సోమశ్రీ బాలాజీతో మాట్లాడడం తగ్గిపోయింది. ఫోన్ చేసినా.. తాను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసేది. చాలాసార్లు అలా కావడంతో బాలాజీకి అనుమానం వచ్చింది. దాంతో బాలాజీ ఆమె మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగాడు. కానీ సోమశ్రీ నుంచి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న తర్వాత సోమశ్రీ బాలాజీతో పూర్తిగా మాట్లాడటం మానేసింది. మోసపోయానని గ్రహించిన బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.