Google Maps : టెక్నాలజీ వాడుకోవాలి కాని గుడ్డిగా దాన్నే నమ్మొద్దు. అలా నమ్ముకుని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇద్దరు మహిళలు Google Maps సాయంతో కారు నడుపుకుంటూ వెళ్లి సముద్రంలో పడ్డ సంగతి తెలిసిందే. అతి కష్టం మీద ప్రాణాలైతే దక్కాయి గానీ కారు పోయింది. అలాగే మరో మహిళ గూగుల్ మ్యాప్స్ ను నమ్మి వెళ్లి అడవిలో ఐదు రోజులపాటు నరకం అనుభవించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఓ మహిళ తన కారులో తనకు తెలియని ప్రదేశానికి ఎంజాయ్ చేద్దామని బయలుదేరింది. దురదృష్టవశాత్తు దారి తప్పి దట్టమైన అడవుల్లో చిక్కుకుంది. అక్కడ మొబైల్ నెట్వర్క్ పని చేయకపోవడంతో సమాచారం అందించలేకపోయింది. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. కేవలం తన దగ్గర ఉన్న లాలిపాప్స్, వైన్ తాగి ప్రాణాలను నిలుపుకుంది.
Read Also:Telangana 10th results: నేడే టెన్త్ రిజల్స్ .. ntvtelugu.com లో చెక్ చేసుకోండి
వివరాల్లోకి వెళితే.. లిలియన్(48) ఒక రోజు పర్యటనకు వెళ్లింది. ఆమె విక్టోరియాలోని హై కంట్రీకి కారులో బయలుదేరింది. అయితే.. దారిలో దట్టమైన అడవి ఉండడం. ఆ దారిలో మనుషులు రావడం లేదన్న విషయాన్ని గమనించింది. దీంతో తాను దారి తప్పిపోయానని ఆమెకు అర్థమైంది. తాను రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నానని గుర్తించిన ఆమె కారును వెనక్కి తిప్పే ప్రయత్నం చేసింది. కానీ, కారు బురదలో కూరుకుపోయింది. ఇతరులను సహయం కోరుదామని భావించినా.. లిలియన్ మొబైల్లో నెట్వర్క్ కూడా లేదు. కాస్తా ధైర్యం చేసి.. నడుచుకుంటూ సహాయం కోసం రాసాగింది. కానీ సరైన మార్గాన్ని కనుకోలేకపోయింది. దాదాపు ఐదు రోజుల పాటు అడవిలోనే ఉండిపోయింది. తినడానికి తిండి లేకుండా అల్లాడిపోయింది.
Read Also:Karnataka assembly elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..
ఇంతలో ఆమె అదృశ్యంపై తన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను వెతకడం ప్రారంభించారు. తొలి రోజు పోలీసులు హెలికాప్టర్ సాయంతో అడవిలోని ప్రతి మూలను వెతికినా లిలియన్ ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఒకరోజు ఎయిర్ వింగ్ కొండ ప్రాంతంలో హఠాత్తుగా ఓ కారు కనిపించింది. దీంతో లిలియన్ సమీపంలోనే ఉండి ఉండవచ్చని పోలీసులు భావించారు. దీంతో సహయక చర్యలు ముమ్మరం చేశారు. మరోసారి రెస్క్యూ సిబ్బంది అడవిలో హెలికాఫ్టర్‌తో వెతులాట ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమెను కనిపెట్టి.. రక్షించారు. ఐదు రోజులు ఎలా గడిపారని పోలీసులు ప్రశ్నించగా.. తాను లాలీపాప్‌లు తినడం , మద్యం సేవించడం ద్వారా ఇన్ని రోజులు జీవించానని, అయితే ఇంతకు ముందు తాను ఎప్పుడూ మద్యం సేవించలేదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
See the moment Air Wing located a woman, who was missing for five days in dense bushland.
Yesterday afternoon, Air Wing were conducting a sweep of the hilly terrain when they spotted Lillian’s car at the end of a dirt road in the Mitta Mitta bushland.
🔗 https://t.co/dgjOkkgdY0 pic.twitter.com/DwbaJHLUMn
— Victoria Police (@VictoriaPolice) May 6, 2023