Kerala Governor Challenge: స్మగ్లింగ్‌కు ముఖ్యమంత్రి అండ.. నిరూపిస్తే రాజీనామా చేస్తారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Governor Challenge: విశ్వవిద్యాలయాల వీసీల నియమకాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. లేని పక్షంలో సీఎం రాజీనామా చేయగలరా అంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. రాజకీయ జోక్యం అంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇటీవల వీసీల రాజీనామాలపై ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయుకాలుష్యం.. రంగంలోకి సర్కారు
Also Read
సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయమే రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రికి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయన్నారు. ఇదంతా తాను గమనిస్తూనే ఉన్నానన్నారు. దీనిపై పుస్తకాలు కూడా వెలువడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు తమ బంధువులను ఎటువంటి అర్హత లేకున్నా నియమించుకోవాలని వీసీని ఆదేశించినట్లు గవర్నర్ ఆరోపించారు. తన అధికారాన్ని ఉపయోగించి ఆర్‌ఎస్‌ఎస్‌కే కాదు, ఏ వ్యక్తినైనా, నామినేట్ చేసి ఉంటే దాన్ని నిరూపించండి రాజీనామా చేస్తాను.. లేదంటే మీరైనా రాజీనామా చేయండి అంటూ ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!