కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. తొలుత నిలబడి ఆపై మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం తలను నేలకు ఆన్చి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో షేర్ చేసింది.
Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా ఈ రోజు రాజధాని తిరువనంతపురం నుంచి కొల్లాం జిల్లాకు వెళ్తున్న సమయంలో సీపీఎంకి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) సభ్యులు గవర్నర్‌కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు.
Arif Mohammed Khan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా పరిస్థితి మారింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలికట్ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లిన సమయంలో అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ టార్గెట్‌గా నేరుగా విమర్శలకు దిగారు.
Pinarayi Vijayan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా వివాదం ముదురుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ టార్గెట్‌గా సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ‘‘సంఘ్ పరివార్ ప్రతినిధి’’ అంటూ అభివర్ణించారు. యూనివర్సిటీ సెనెట్‌కి నామినీలను ఎన్నుకునే విషయంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కేరళ విశ్వవిద్యాలయ సిఫారసులను తిరస్కరించిన తర్వాత విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. శుక్రవారం రాత్రి నోయిడాలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆయన భద్రతలో ఉల్లంఘన జరిగింది.
విశ్వవిద్యాలయాల వీసీల నియమకాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాలను కోరారు.