MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్‌సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. TB ఫ్రీ ఇండియా అండ్ ఫిట్ ఇండియా అనే ఏకైక లక్ష్యంగా ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Also Read: Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్‌తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను తీసుకురాబోతున్న పోకో
#WATCH | Delhi: Congress MP Deepender Singh Hooda awarded as the Best Bowler in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs. pic.twitter.com/PixG7E7sWh
— ANI (@ANI) December 15, 2024
ఇక అవగాహన కల్పించేందుకు ఎంపీల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్‌పై విజయం సాధించింది. లోక్‌సభ ఎలెవన్ తరఫున కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు లోక్ సభ ఎలెవన్ బౌలర్ దీపేందర్ హుడా కూడా తన ప్రతిభ కనబరిచి అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ స్పీకర్స్ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో 251 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ స్కోర్ ను చేధించే క్రమంలో రాజ్యసభ ఎలెవన్ 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో రాజ్యసభ స్పీకర్ ఎలెవన్‌పై విజయం సాధించింది.
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB. pic.twitter.com/EsbHeLrH73
— Lakshay Mehta (@lakshaymehta31) December 15, 2024
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు