Husband K*illed: పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ.. ఇష్టం లేని వివాహం చేసుకుని భర్తను..
- పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ
- ఇష్టం లేని వివాహం
- భార్య తన ప్రియుడైన ఉపాధ్యాయుడి సహాయంతో భర్తను హత్య చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని బలోత్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్వా గ్రామంలో, ఓ భార్య తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు నిందితులైన భార్య, ప్రియుడు ఇద్దరినీ అరెస్టు చేశారు. అసలు విషయం ఏమిటంటే, మూడేళ్ల క్రితం, మాల్వా గోయలన్‌లోని మేఘ్వాల్ నివాసి, పెమారం కుమారుడైన మృతుడు మహేంద్ర కుమార్ (21)కు, బగుండి నివాసి అయిన అను దేవితో వివాహం జరిగింది. ఈ పెళ్లి అను దేవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య చాలా వరకు తన పుట్టింట్లోనే ఉండేది.
Also Read:Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
పెళ్లికి ముందు అనుదేవి తిలవారాకు చెందిన చెనారామ్ మేఘ్వాల్ కుమారుడైన అమరారామ్ అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఆ తర్వాత ప్రేమించుకున్నారు. అమరారామ్ చిడియా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటాడు. అను, ఆ ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత, అనుకి, ఆమె భర్తకి మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. దానిపై చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీల తర్వాత అను తన అత్తగారింటికి వచ్చింది, కానీ అక్కడికి వచ్చిన రెండు రోజులకే ఆమె తన ప్రియుడు అమరారామ్‌కి ఫోన్ చేసింది.
Also Read:Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి
ప్రియుడిని పిలిపించుకుని గాఢ నిద్రలో ఉన్న మహేంద్రను గొంతు నులిమి చంపేశారు. ఉదయం మహేంద్ర నిద్ర లేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లిచూసింది. అచేతనంగా మహేంద్ర పడి ఉండడం, శరీరం, మెడపై గీతలు ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. అప్పుడు మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యాయుడు అమరారామ్‌ను, మృతుడి భార్య అనును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఇద్దరూ మహేంద్రను గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!