గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భార్యలు, భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? భర్తలను చంపి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య ఈ ఘటన ఉన్నావ్ లో చోటుచేసుకుంది. జాజ్‌మౌ ప్రాంతంలోని ఇఖ్లాక్ నగర్‌లో నివసిస్తున్న ఇమ్రాన్ అలియాస్ కాలేను అతని…