Madhya Pradesh : లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మరో లవర్ దొరకగానే ‘మాజీ’ని మట్టుపెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త అడ్డుగా మారడంతో భార్య భర్తను చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మరణానికి ముందు భర్త తన భార్య అక్రమ సంబంధాన్ని కనుగొన్నాడు. మొబైల్ ఫోన్‌లోని వీడియో కారణంగా భార్య పన్నాగం బట్టబయలైంది. భార్య, ఆమె ప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సలీహా పర్వీన్, బంటు ఖాన్‌లుగా గుర్తించారు.
Read Also: Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
షాహిద్ ఖాన్, సలీహా ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా సలీహాను షాహిద్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్యం సజావుగానే సాగింది. అయితే కొద్దిరోజుల తర్వాత బంటు ఖాన్‌తో సలీహా అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో షాహిద్‌ను తన దారికి తెచ్చుకోవాలని సలీహా భావించింది. నెలరోజుల నుంచి షాహిద్‌ను హత్య చేయాలని సలీహా ప్లాన్ చేస్తోంది. ఎట్టకేలకు తన ప్లాన్ అమలు చేసింది. తన భర్త అయిన షాహిద్‌కు టీలో విషం కలిపి ఇచ్చింది. టీ తాగిన తర్వాత షాహిద్ విషం కలిపిన విషయాన్ని గ్రహించాడు.. దాంతో తనకు బతికే అవకాశం లేదని తెలుసుకుంటాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి తన భార్య చేసిన దారుణాన్ని చిత్రీకరించాడు. తన చావుకు భార్య సలీహా, ఆమె ప్రేమికుడు బంటు, అత్తగారే కారణమని ఆరోపించారు. టీ తాగిన తర్వాత షాహిద్ ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also:Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే షాహిద్ తండ్రి ఆస్పత్రికి చేరుకున్నారు. షాహిద్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు చనిపోవడంతో, తండ్రి అతని మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేశాడు. ఈ సమయంలో వారికి మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో దొరికింది. ఈ వీడియోలో షాహిద్ తన చావుకు తన భార్యే కారణమని చెబుతున్నాడు. తన భార్య టీలో విషం కలిపిందని కూడా చెప్పాడు. షాహిద్ తండ్రి ఆ వీడియోను పోలీసులకు చూపించి కోడలిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా వారు నేరం అంగీకరించారు.
తాజావార్తలు
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!