Site icon NTV Telugu

Extramarital Affair: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

Crime

Crime

Extramarital Affair:వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన సోమారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పెద్దాయిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. రాజంపేట మండలం పెద్దాయిపల్లికి చెందిన గంగు లింగంకు లావణ్య అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ తరుణంలో లావణ్య తన ఇంటి సమీపంలో ఉంటున్న గోవింద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గంగు లింగం భార్య లావణ్యకు పెద్దాయిపల్లి గ్రామానికి చెందిన శంకరిగారి గోవిందుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న లింగం లావణ్యతో పలుమార్లు గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read Also: DGP Anjanikumar: రాష్ట్రంలో సైబర్‌ తప్ప అన్ని నేరాలు తగ్గాయి: డీజీపీ

ఈ క్రమంలోనే లింగ తన భార్యతో గొడవ పడ్డాడు. అప్పటికే భర్త అడ్డు తొలగించుకుందామని గోవింద్‌తో కలిసి వేసుకున్న పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి గోవిందుతో కలిసి భర్త లింగంను పెద్దాయిపల్లి శివారులో గల సిద్దుల గుట్ట ప్రాంతంలో గొంతు కోసి హత్య చేసింది. లింగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనం, 3 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version