NTV Telugu Site icon

UP: తన భార్య రోజూ మద్యం తాగుతూ.. తనతో కూడా బలవంతంగా తాగిస్తుందని భర్త ఆవేదన..

Up News

Up News

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి తన భార్య తనకు బలవంతంగా తాగించిందని ఆరోపించాడు. భార్య ఒత్తిడికి విసిగిపోయిన భర్త తన భార్యను ఆమె తల్లి వద్ద వదిలిపెట్టాడు. ఈ విషయమై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యాభర్తలను కుటుంబ సలహా కేంద్రానికి తరలించారు.

READ MORE: Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

భార్యాభర్తల మధ్య కౌన్సెలింగ్ జరగడంతో అక్కడికక్కడే వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య రోజూ మద్యం తాగుతుందని, తనను కూడా తాగమని ఒత్తిడి చేస్తుందని భర్త ఆరోపించాడు. తాను రోజూ మద్యం తాగలేనని భర్త చెబుతున్నా భార్య మాత్రం రోజూ మద్యం తాగాలని ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఒకేసారి మూడు నుంచి నాలుగు పెగ్గులు తాగిస్తుందని ఆరోపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఆరోపణలన్నింటినీ భార్య అంగీకరించింది. బాధితుడి కథనం ప్రకారం.. అయితే వీరికి రెండు నెలల కిందటే వివాహమైంది. దీని తర్వాత, ఆమె ప్రతిరోజూ మద్యం తాగడం ప్రారంభించింది. దానిని తాగమని బలవంతం చేసింది. అతను తన భార్య తాగుడు అలవాటుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆమెను తల్లిదండ్రుల ఇంటికి పంపించాడు. కౌన్సిలింగ్‌తో భార్యాభర్తలు కలిసి జీవించేందుకు అంగీకరించారు.

READ MORE:Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

Show comments