నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటి మూడు సీజన్లలో సినీ, రాజకీయ ప్రముఖములను షోకు పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అయింది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహిస్తున్నారు. బాలయ్య సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి సెట్‌లోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
READ MORE: Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..
అయితే.. సీఎం చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొనడం ఇది రెండోసారి. అన్‌స్టాపబుల్ సీజన్ 3 లో కూడా ఆయన పాల్గొని ప్రేక్షకులను అలరించారు. వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు, జనాలకు తెలియని అంశాలను వెల్లడించారు. ఆ ఎపిసోడ్ ఎంతో సరదాగా సాగింది. ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 25 నుంచి కొత్త సీజన్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాల్లో సంచలన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు రాకతో ఈ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
READ MORE:Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి