SS Thaman: వరుస విజయాలతో సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎస్.ఎస్. తమన్‌ను నిన్నటి వరకు ఆకాశానికి ఎత్తిన వారే, ఇప్పుడు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే ఈ విమర్శలు అధికంగా వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు తమన్‌పై విమర్శల వెనుక కారణాలేంటి? నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ ఎందుకు? అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ, తమన్ కాంబోలో వరుసగా నాలుగు హిట్స్…