ఈ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం సర్వ సాధారణంగా మారింది. ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోతామంటారు. తీరా పెళ్లి అయ్యాక పలు కారణాల వల్ల విడిపోయేందుకు సిద్ధమవుతుంటారు. ఇప్పటి తరం జంటల గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు చనిపోవడానికి రెడీ.. అంటారు. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే ఇద్దరు కలిసి ఉంటే చచ్చిపోతామంటూ విడిపోతారు. ఇలాంటి రిలేషన్ షిప్ లో వీరి సమస్యకు కారణం ఏంటని చూస్తే.. చిన్న విషయం కూడా పెద్దదే అనే నిర్ణయానికి వస్తారు. కొన్ని సంబంధాలలో అవే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడుతుంది.
READ MORE: Organ Donation: కెనడాలో మృతి చెందిన యువకుడి మృతదేహం సూరత్లోని వైద్య విద్యార్థులకు విరాళం..
ముందునుంచే ప్రేమలో ఉన్న జంట చనువుగా ఉంటారు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇద్దరూ ఇష్టానుసారంగా వాధించుకుంటారు. ఎంత కోపం వచ్చినా పదాలు తక్కువగా వాడాలి. లేకుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ విషయంలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా తప్పులు చేస్తుంటారు. చాలా మంది మగవాళ్ళకి నేను చెప్పేది వినాలి అనే ఫీలింగ్ ఉంటుంది. మరికొందరు స్త్రీలు పురుషులను గౌరవించరు. మీ భాగస్వామి మీకు తాగవద్దని చెబుతారు. కానీ సాయంత్రమైతే తాగే ఇంటికి వస్తారు. ఇది గొడవను పెంచుతుంది. మీరు పదేపదే తప్పు చేస్తే, ఇది ఇద్దరు వ్యక్తులను భిన్నంగా చేయవచ్చు. ఈరోజు మహా శత్రువు సోషల్ మీడియా. అందులో సమయం గడపడం వల్ల దంపతుల మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. దీని వల్ల కుటుంబంలో సమస్యలు కూడా వస్తాయి. సోషల్ మీడియాలో మునిగిపోవడం లేదా సోషల్ మీడియాలో ఇంటి విషయాలను పోస్ట్ చేయడం వల్ల కుటుంబం నాశనం అవుతుంది.
ఈ తప్పులు చేయవద్దు. బంధం అంటే బాధ్యతగా జీవితాంతం కలిసి ఉండేది.. చిన్న విషయాలకే విడిపోయేది కాదు. ఒకసారి చేసిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అప్పుడే బంధం గట్టిగా ఉంటుంది. పాత సమస్యను తవ్వడం ఎండిన గాయాన్ని గోకడం లాంటిది. గతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తు చేసుకోరాదు. కొందరు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపడంతో గొడవలు మొదలవుతాయి. ఈ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్తుంది. ఈ తప్పు చేయవద్దు. పాత సమస్యను అక్కడ వదిలేయాలి. దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు గౌరవంగా ఉండాలి. కానీ కొంతమంది ఒంటరిగా వదిలేస్తారు. గౌరవం ఇచ్చేది ఏముందిలే అనుకుంటారు. అలాంటి సంబంధం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండదు.