గుజరాత్లోని మోర్బీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో టాపర్లలో ఒకరైన ఆమె తాజాగా మెదడులో రక్తస్రావం కారణంగా మరణించింది. గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (జీఎస్ఈబీ) మే 11న ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలో బాలిక 99.70 % మార్కులు సాధించింది. ఆమె మెదడులో రక్తస్రావం కావడంతో ఒక నెల క్రితం రాజ్కోట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది. కానీ వారం క్రితం ఆమెకు మళ్లీ శ్వాస, గుండె సమస్యలు మొదలయ్యాయి.
Read Also: Woman Saree: ఇది కదా.. భారతీయ సంప్రదాయం అంటే.. చీరకట్టులో యువతిని చూసి.. జపాన్ ప్రజలు షాక్..
ఆమెను ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చారు. ఎంఆర్ఐ నివేదికలో ఆమె మెదడులో 80 నుండి 90 శాతం పనిచేయడం ఆగిపోయిందని తేలింది. ఆమె గుండె పనిచేయడం ఆగిపోవడంతో బుధవారం హీర్ మరణించింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు ఆమె కళ్ళను, ఆమె శరీరాన్ని దానం చేశారు. “తాను డాక్టర్ కావాలనుకుంది. ఆమె డాక్టర్ కాకపోయినా, ఇతరుల ప్రాణాలను కాపాడటానికి సహాయపడటానికి మేము ఆమె శరీరాన్ని దానం చేసాము ” అని ఆమె తండ్రి చెప్పారు.