ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు చిరునామాగా నిలిచే చీరకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరిగే అంతర్జాతీయ ఫ్యాషన్ షోలల్లో చాలామంది మోడల్స్ చీర స్ఫూర్తితో డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మెరుస్తుంటారు. చీర కట్టడం ఎందరో ష్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తిగా నిలిచింది. భారతీయులు ప్రపంచం నలుమూలలా ఉండటంతో మన వస్త్రధారణ గురించి వారికి తెలుసు. ఇక ఈ విషయమంతా ఎందుకంటే.. తాజాగా ఓ భారతీయ యువతి చీర ధరించి జపాన్ వాసులను సంబర ఆశ్చర్యలకు గురి చేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Indonesia: ఇండోనేషియాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాన్ని ఆపడానికి క్లౌడ్ సీడింగ్..
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియోలో, అమ్మాయి బంగారు అంచులతో నీలం చీర ధరించి, జపాన్ వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఆమె తన చీరను ట్యూబ్ జాకెట్ తో జత చేసి, తన పెద్ద జుట్టును వదులుగా ఉంచింది. దాంతో అక్కడ కొంతమంది స్థానికులు ఆమెను ఆశ్చర్యంతో చూస్తే, మరికొందరు ఆమెతో మాట్లాడానికి ప్రయత్నిస్తారు. వీడియో కొనసాగుతున్నప్పుడు, కొంతమంది యువతులు, అబ్బాయిలు ఆమెను చిత్రీకరించడం చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. ఈ పోస్ట్ కు శీర్షికలో ఇలా ఉంది. “నేను జపాన్లో చీర ధరించాను. అల్లా వెళ్తున్నప్పుడు జపనీయుల ప్రతిస్పందనలు ఉల్లాసంగా ఉన్నాయి. కేవలం వినోదం కోసం టోక్యో వీధుల్లో భారతీయ దుస్తులు ధరించాలని నేను అనుకున్నాను, కాని ప్రజలు నిజంగా చిత్రాలు తీసి ఆశ్చర్యపోతారు అని ఊహించలేదు ” అంటూ తెలిపింది.