Telangana New IT Minister: తెలంగాణ కొత్త ఐటీ మంత్రి ఎవరో తెలిసిపోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సీఎం పదవి స్థాయిలోనే ఐటీ శాఖపై చర్చ కొనసాగుతుంది. కొందరు బీఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లయితే అధికారం కాంగ్రెస్ దే అయినా ఐటీ మంత్రిగా కేటీఆర్ ను కొనసాగించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి కేటీఆర్ లాంటి గొప్ప ఐటీ మంత్రిని తెలంగాణ కోల్పోయిందంటూ నెట్టింట కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఇంతకు ముందు ఐటీ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే ఐటీ అనేలా తయారైంది.. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఐటీ మంత్రి పదవి ఎవరికి ఇస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త ఐటీ మంత్రి వీళ్లేనంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఉన్నత విద్యావంతుడు, గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు సొంతం.. దీంతో ఆయనయితే ఐటీ శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తాడని టాక్.. కేటీఆర్ పేరును మరిపించగలడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.
Read Also: Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రాజధాని మనీలా ఖాళీ చేయాలని ఆదేశాలు..
Also Read
- Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
- US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
ఇక, శ్రీధర్ బాబు కాకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరో ఒకరికి ఈ ఐటీ శాఖను అప్పగించే ఛాన్స్ ఉందని టాక్. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడికే ఐటీ శాఖను అప్పగించాలని అధిష్టానం భావిస్తుందట. దాంతో సీఎం రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఐటీ శాఖతో పాటు మరికొన్ని కీలక శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఐటీ శాఖ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కాల్ లో ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ కొత్త సీఎం పదవిపై సందిగ్దత నెలకొన్నా రేవంత్ రెడ్డికే ఆ పదవి తన వద్దే పెట్టుకోనున్నాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఐటీని అభివృద్ది చేసేందుకు ఈ శాఖ సీఎం వద్దే వుంటే బావుంటుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!