ఐటీ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే ఐటీ అనేలా తయారైంది.. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఐటీ మంత్రి పదవి ఎవరికి ఇస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త ఐటీ మంత్రి వీళ్లేనంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.