ISI: పాక్ గూఢచార సంస్థ చీఫ్‌గా అసిమ్ మాలిక్.. ఎవరు ఇతను..?
- పాక్ ఐఎస్ఐకి కొత్త బాస్‌గా ఆసిమ్ మాలిక్..
- ఆ దేశ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్‌లో నెంబర్ 2గా ఉంటారు.
Read Also: Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ నియామకానికి ముందు మాలిక్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో అడ్జటెంట్ జనరల్(ఏజీ)గా పనిచేశారు. గత మూడు ఏళ్లుగా చట్టపరమైన మరియు క్రమశక్షణా వ్యవహరాలతో సహా సైనిక పరిపాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నాడు. పదవీ విరమణ చేసి ఐఎస్ఐ చీప్ జనరల్ నదీమ్ అంజుమ్‌ని నవంబర్ 2021లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించారు. సెప్టెంబర్ 2022లో అతడి పదవీకాలం ఒక ఏడాది పొడగించబడింది. ఇదే సమయంలో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాల్సి వచ్చింది. తనను దించేందుకు పాక్ సైన్యం కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని సైన్యం తిరస్కరించింది.
59 ఏళ్ల మాలిక్‌కి ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ సంబంధిత విభాగాల్లో పెద్దగా అనుభవం లేదు. గతంలో ఈయన బలూచిస్తాన్, దక్షిణ వజీరిస్థాన్ పదాతిదళానికి నాయకత్వం వహించారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా హింసకు మారుపేరుగా ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం మాలిక్ సొంతం. పాకిస్తాన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో పాటు క్వెట్టాలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో బోధకుడిగా పనిచేశాడు. మాలిక్ తన శిక్షణ సమయంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరు. అసిమ్ మాలిక్.. మాలిక్ మహ్మద్ గులాం కుమారుడు. ఇతను 1990లో త్రీస్టార్ జనరల్‌గా పనిచేశాడు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!