ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్‌లో నెంబర్ 2గా ఉంటారు.